ఒక రెండు నెలలు ప్రాజెక్ట్ వర్క్ కోసం నన్ను కోయంబతుర్ కి పపించారు మా మేనేజర్ , నేను ఏదో పుడింగ్ అనుకోని. యాంత్రిక జీవితం లో మునిగి పోయి, విసిగి పోయిన నేను అనుకోకుండా ఒక అతిలోక సుందరి ని చుసాను. నా కళ్ళు ఇప్పటి వరకు చూడని ఒక అద్బుతాన్ని చూసినట్టు అలాగే చూస్తూ వున్నాయి...
ఆ అమ్మాయి ఎంత అందంగా వుంది అంటే చుసిన వాళ్ళు చెప్పలేను అంత , చూడని వాళ్ళు ఊహించలెని అంత అందంగా వుంది... సినిమా లో చుపునిచినట్టు అంత స్లో మోషన్ లో వెళ్తున్నాట్టు వుంది. నేను గనక కవి ని అయ్యి వుంటే చుసిన వెంటనే ఒక 10 కవితలు రాసే వాడిని. అంత సింపుల్ గ అందంగా అతిలోక సుందరి ల వుంది మరి .
అహ్హ్ అమ్మాయి పేరు sariga అంట పక్కనే ఉన్న ఎవరో పిలుస్తుంటే విన్న. చూస్తూ వుంటే తెలుగు అమ్మాయి లా ఉన్న తెలుగు మాత్రం కాదు .. ఐన పేరు , ఊరు ఏది అయితే ఏంటి ఐశ్వర్య రాయ్ ని ఈ అమ్మాయి ని పక్కన పెడితే నేను ఈ అమ్మాయే అందంగా వుంది అని ఆలోచించ కుండ చెప్తా. రోజా పువ్వు అమ్మాయిగా మారితే ఎలా వుంటుందో అల వుంటుంది ....
వెళ్లి మాట్లాడాలని, ఒక ఫోటో తీస్కున్దామని అనిపించింది, కానీ అలాగే చూస్తూ ఆగిపోయా. వేసుకున్న డ్రెస్ మొత్తం మాచింగ్ మాచింగే.. ఆ కమ్మలు రెండు రంగులలో ఉన్నాయి రెడ్ అండ్ వైట్ , ఇలాంటి కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదు. చేతికి జస్ట్ 2 గాజులు అవి కూడా రెండు కలర్స్ వున్నాయి , ఒకటి రెడ్ ఇంకోటి గ్రీన్. హల్వా రంగులో నైల్ పోలిష్డ్ హాండ్స్ చుస్తే అలాగే తినేయాలి అనిపించే లా ఉన్నాయ్..
ఇంకా ఎం చెప్పను అహ్హ్ అమ్మాయి గురుంచి. శ్రీదేవి వచ్చి అహ్హ్ అమ్మాయి కంటె నేనే అందంగా వున్నాను అని అంటే నమ్మే పరిస్థితి లో లేను మరి ...
ఆ తరువాత మళ్ళి చుడలేదు ...
ఆ తరువాత మళ్ళి చుడలేదు ...
Comments
Post a Comment